Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా... బంగ్లాదేశ్ కు బ్యాటింగ్ అప్పగింత

  • గాయంతో హషీమ్ ఆమ్లా ఔట్
  • ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ కు స్థానం
  • వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న బంగ్లా
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో ఇవాళ దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు లండన్ వేదికగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. దక్షిణాఫ్రికా జట్టులో సీనియర్ బ్యాట్స్ మన్ హషీమ్ ఆమ్లా గాయపడడంతో అతడి స్థానంలో ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ ను తీసుకున్నారు. తొలి మ్యాచ్ లో ఇంగ్లాండ్ చేతితో పరాజయంపాలైన సఫారీలు ఈ మ్యాచ్ లో గెలిచి బోణీ కొట్టాలని కృతనిశ్చయంతో ఉన్నారు. అయితే, బంగ్లాదేశ్ జట్టును తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. గతకొంతకాలంగా బంగ్లాదేశ్ టీమ్ పెద్ద జట్లను కూడా ఓడించి ఇంటర్నేషన్ క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దాంతో ఇవాళ్టి మ్యాచ్ పై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది.
Cricket

More Telugu News